స్వర్గీయ ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనున్నారు. యువరత్న బాలకృష్ణ హీరోగా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా తెరకెక్కిస్తున్నారు.
అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను మూడు గంటల సినిమాగా చూపించడం చాలా కష్టమని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారు. దీంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా దీన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారట.
ఇందులో తొలిభాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, మరో భాగంలో రాజకీయ ప్రయాణాన్ని చూపాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత బాలయ్యకు చెప్పగా, ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయారట. మరి బాలకృష్ణ తీసుకునే నిర్ణయంపై ఎన్టీఆర్ బయోపిక్ ఒకే పార్టులో వస్తుందా లేదా రెండు పార్టుల్లో వస్తుందా అనేది ఆధారపడివుంటుంది.