బాలయ్య - బోయ‌పాటి సినిమాని నిర్మించేది ఎవ‌రో తెలుసా..?

ఆదివారం, 27 మే 2018 (15:08 IST)
నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ ఎన్టీఆర్ పేరుతో బ‌యోపిక్ స్టార్ట్ చేసారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ప్ర‌స్తుతానికి ఆగింది. అయితే.. ఈ సినిమా కంటే ముందు రెండు సినిమాలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు బాలకృష్ణ. ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ అందించారు. సి.క‌ళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
ఇదిలావుంటే... తనకు 'సింహా', 'లెజెండ్‌' లాంటి ఘనవిజయాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ ఓ సినిమాను ప్రారంభించనున్నారట. ఈ సినిమాను బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్‌ 10న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఈ సినిమాను బాలయ్య స్వయంగా ఎన్‌.బి.కె ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ను కూడా బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మ‌రి... ఇన్నాళ్లు హీరోగా విజ‌యం సాధించిన బాల‌య్య నిర్మాత‌గా కూడా విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు