మైఖేల్ ట్రైలర్‌ను విడుదల చేసి ఆల్ ది బెస్ట్ చెప్పిన బాలకృష్ణ

సోమవారం, 23 జనవరి 2023 (18:11 IST)
Balakrishna with Michael team
హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘’మైఖేల్’. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  చిత్రం కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, ఇందులో రొమాన్స్, డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ తో ఆశ్చర్యపరిచారు ఈరోజు బాలకృష్ణ  మైఖేల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
 
ట్రైలర్ దాదాపు ప్రతి పాత్రను డార్క్ వే లో చూపిస్తుంది. గౌతమ్ మీనన్, సందీప్ కిషన్‌ను స్త్రీల గురించి వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రేమలేని జీవితానికి అర్ధం లేదని సందీప్ భావిస్తాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయి దివ్యాంశ కౌశిక్ కూడా తనతో ప్రేమలో పడితే, హార్ట్ బ్రేక్ అవుతుందని హెచ్చరిస్తుంది. యంగ్ సందీప్ కిషన్ ఒకరిని తుపాకీతో కాల్చడంతో ట్రైలర్ ముగుస్తుంది. విజయ్ సేతుపతి వార్నింగ్ ఇస్తూ కనిపించడం ట్రైలర్ కి మరింత సీరియస్ నెస్ ని తీసుకొచ్చింది.
 
ట్రైలర్ మైఖేల్ ఒక అందమైన ప్రేమకథ, స్టైలిష్ విజువల్ ట్రీట్‌మెంట్‌తో ఇంటెన్స్ , యాక్షన్ ఎంటర్ టైనర్ అనే అభిప్రాయాన్ని ఇస్తుంది. గ్యాంగ్‌స్టర్ కార్లు, రెడ్-థీమ్ బ్యాక్‌డ్రాప్‌లు,  రెట్రో దుస్తులను చూపడం ద్వారా వింటేజ్ అనుభూతిని కలిగిస్తుంది. క్యారెక్టరైజేషన్స్ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ అని అర్ధమౌతుంది. ప్రతి సన్నివేశంలో  రంజిత్  ఎఫర్ట్ కనిపిస్తోంది. మైఖేల్ పాత్రలో సందీప్ కిషన్ జీవించాడు. సందీప్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. తన ప్రేయసి పట్ల వున్న ప్రేమ, పెయిన్ రెండింటినీ అద్భుతంగా గ్రేట్ ఇంటెన్స్ తో పెర్ ఫార్మ్ చేశాడు. విజయ్ సేతుపతి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. వరలక్ష్మి శరత్‌కుమార్ యాక్షన్ రోల్‌లో ఆకట్టుకుంది. ఇందులో వరుణ్ సందేశ్ సాలిడ్ రోల్ కనిపించాడు. అనసూయ భరద్వాజ్ బలమైన పాత్రలో కనిపించింది.
 
కిరణ్ కౌశిక్ కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. రా ఎనర్జీని బాగా క్యాప్చర్ చేసింది. సామ్ సిఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  రానెస్ ని ఎలివేట్ చేసి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రొమాంటిక్ సన్నివేశాలకు స్కోర్ అద్భుతంగా ఉంది. ఈ చిత్రానికి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ రాశారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి,  మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాణ విలువలు ఆత్యద్భుతంగా వున్నాయి.  
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గారికి మైఖేల్ ట్రైలర్ చాలా నచ్చంది. ట్రైలర్ చూసి ‘’అదిరిపోయింది’ చెప్పారు. మా ట్రైలర్  లాంచ్ చేసినందుకు బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఇంత కష్టపడటానికి  ఎనర్జీ ఇచ్చింది ప్రేక్షకులే. మనం చేసే పనికి  కొందరు అభిమానులు వుంటారు. మనం కాస్త నిరాశలో వున్నప్పుడు వాళ్ళే మనకి ఎనర్జీ ఇస్తూ వుంటారు. ఆ ఎనర్జీ నుంచే కొన్ని మ్యాజికల్ మెంటల్ సినిమాలు పుడుతూ వుంటాయి. అలాంటి ప్రయత్నమే మైఖేల్. ఇది పూర్తిగా తెలుగు సినిమా. మన సినిమా. మనమందరం గర్వపడే సినిమా. రంజిత్ అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాతలు ఇప్పటివరకూ ఎప్పుడూపెట్టని బడ్జెట్ ఈ సినిమా కోసం పెట్టారు. ఎప్పుడూ చేయని బిజినెస్ చేశారు. మీ అందరి ప్రేమ కావాలి’’ అని కోరారు.
 
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడానికి కారణం సందీప్ కిషన్. తనే ఫోన్ చేసి ఈ పాత్ర గురించి చెప్పి నాకు కొత్తగా వుంటుంది చెప్పాడు. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఖచ్చితంగా కొత్తగా క్రేజీ గా వుంటుంది. ఇలాంటి పాత్రని రాసిన దర్శకుడు కి కృతజ్ఞతలు. భరత్ గారు ఎంతో చక్కగా చూసుకున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ నెక్స్ట్ లెవల్ లో వుంటారు. ఫిబ్రవరి 3 అందరూ మైఖేల్ చూడండి’’ అన్నారు.
 
దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ.. మా హీరో, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఫిబ్రవారి 3న అందరూ థియేటర్ లో సినిమా చూడాలి’’ అని కోరారు.
 
నిర్మాత భరత్ చౌదరి మాట్లాడుతూ.. సినిమా కంటెంట్, బిజినెస్ పరంగా నిర్మాతలుగా మేము హ్యాపీగా వున్నాం. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. హీరో, దర్శకుడి కష్టం ట్రైలర్ లో చూశారు. సక్సెస్ మీట్ లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం’’ అన్నారు
 
మైఖేల్  ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు ల జాయింట్ ప్రొడక్షన్ వెంచర్. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ట్రైలర్ తో హ్యుజ్ బజ్ పెంచిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.  
 
తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్,అనసూయ భరద్వాజ్ తదితరులు
 
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: రంజిత్ జయకొడి
నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
సమర్పణ: నారాయణ్ దాస్ కె నారంగ్
బ్యానర్లు: శ్రీ వెంక‌టేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, క‌ర‌ణ్ సి ప్రొడ‌క్షన్స్ ఎల్ఎల్‌పి
సంగీతం: సామ్ సిఎస్
డీవోపీ: కిరణ్ కౌశిక్
డైలాగ్స్: త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ : కె. సాంబశివరావు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు