సూపర్ స్టార్ మూవీపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..!

గురువారం, 9 జులై 2020 (10:56 IST)
బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.. కరోనా బారినపడడం, ఆతర్వాత ఈ వ్యాధి నుంచి బయటపడడం తెలిసిందే. ఈ సందర్భంగా బండ్ల గణేష్ తన మనసులో మాటలను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇంతకీ బండ్ల గణేష్ ఏమన్నారంటే... కరోనా వ్యాధి తనకు వచ్చింది అని తెలిసినప్పుడు చాలా భయపడ్డానని అన్నారు.
 
ఒకవేళ సడన్‌గా చనిపోతే ఏంటి అనిపించింది. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ భయపడ్డాను అంటూ కరోనా అనుభవాన్ని బయటపెట్టారు. కరోనా తీసుకువచ్చిన మార్పు ఏంటంటే.. జీవితం చాలా చిన్నది. 
 భగవంతుడి దయ వలన ఈ స్థాయిలో ఉన్నాను. అందుచేత ఇక నుంచి ఎలాంటి గొడవలు లేకుండా.. ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నాను అన్నారు. 
 
ఇదిలావుంటే... సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో బండ్ల గణేష్ నటించిన విషయం తెలిసిందే. దీని గురించి స్పందిస్తూ... సినిమా బ్లాక్‌బస్టర్. కాకపోతే ఈ సినిమాలో తన పాత్రకు ఆశించిన స్ధాయిలో స్పందన రాలేదని... ఆ పాత్ర తనకు సంతృప్తి కలిగించలేదని చెప్పారు.
 
చాలామంది తన స్నేహితులు ఎందుకు ఆ సినిమాలో నటించావని అన్నారు. ఇక నుంచి అలాంటి పాత్రలు చేయదలనుకోలేదు. పర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర అయితే చేస్తాను తప్ప... రెగ్యులర్ కామెడీ క్యారెక్టర్స్ చేయనని చెప్పారు బండ్ల గణేష్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు