ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.
అయితే, ఈ చిత్రం విడుదలైన తొలి రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 రోజుల్లో 49 కోట్ల షేర్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ 5 రోజుల్లో రూ.76 కోట్ల షేర్‌ను రాబట్టింది.