టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం ''భరత్ అనే నేను'' సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కోసం పెద్ద కథ రాసుకున్నారని, అందుకు తగినట్లు షూటింగ్ కూడా చేశారు. కానీ ఎడిటింగ్ ద్వారా చాలా సన్నివేశాలను కట్ చేసి చివరికి 2 గంటల 53 నిముషాల సినిమాను కుదించారు. మిగిలిన సీన్స్ కూడా చేర్చితే, భరత్ అనే నేను సినిమాను రెండు పార్ట్స్ చేయొచ్చునని కొరటాల శివ ఇంతకుముందే వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కట్ టేసిన సన్నివేశాలను యూట్యూబ్ ద్వారా భరత్ అనే నేను సినిమా టీమ్ విడుదల చేస్తోంది. ఈ వీడియోలో అసెంబ్లీ సన్నివేశం, రైతులు, పల్లె జనాల సన్నివేశాలు ఉన్నాయి. వాటిని చూసిన చాలా మంది ప్రేక్షకులు ఇంత మంచి సన్నివేశాలను సినిమా నుంచి ఎందుకు తీసేశారని ప్రశ్నిస్తున్నారు. సినిమాను రెండు భాగాలుగా చేసివుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సన్నివేశాలే వైరల్ అవుతున్నాయి.