బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్ అతడే.. గూగుల్ చెప్పేసిందిగా..?

మంగళవారం, 24 నవంబరు 2020 (11:32 IST)
Abijeet
బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగో సీజన్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంటోంది. 11వ వారంలో లాస్య ఇంటి నుండి ఎలిమినేట్ అయింది. ఇక మరో మూడు వారాల ఆట మాత్రమే మిగిలుంది. ఇంకా హౌజ్‌లో ఏడుగురు ఉన్నారు. అభిజీత్, అఖిల్, అవినాష్, హారిక, మోనాల్, అరియనా, సోహైల్ ప్రస్తుతం హౌజ్‌లో కొనసాగుతున్నారు.
 
ఈ నేపథ్యంలో... నామినేషన్ ప్రక్రియలో భాగంగా అఖిల్.. మోనాల్‌తో స్వాప్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా నేను నీ కన్నా స్ట్రాంగ్ అని తెలుసు. చాలా సార్లు నీకు సపోర్ట్ చేశాను ఈ సారి నామినేషన్‌లోకి రా అని అఖిల్ చెప్పడంతో అందుకు అఖిల్‌తో విభేదించింది మోనాల్. నాకు ఇక్కడి నుండి రావడం ఇష్టం లేదని చెప్పింది. ఎపిసోడ్ మొదట్లో అఖిల్ మాట్లాడిన మాటలకు చాలా హర్ట్ అయిన మోనాల్‌.. స్వాప్ చేసేందుకు అసలు ఆసక్తి చూపలేదు. దీంతో అరియానా .. సోహైల్, మోనాల్‌లతో స్వాప్ చేసుకునేందుకు ప్రయత్నించింది
 
ముందు సోహైల్‌తో స్వాప్ చేసుకునేందుకు అరియానా చాలా ప్రయత్నించినప్పటికీ అక్కడ వర్కవుట్ కాలేదు. ఇక మోనాల్‌తో చాలా సేపు వాదించింది. నీకన్నా చాలా బాగా గేమ్ ఆడుతున్నాను అంటూ పాత విషయాలు తవ్వి మోనాల్‌ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ మోనాల్ కరగలేదు. ఇక అభిజిత్ ఛాన్స్ రాగా, అతను తనకు స్వాప్ చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేశాడు. 
 
రీసెంట్‌గా మోనాల్ తల్లి స్టేజ్‌పై నుండి నువ్వు నా ఫేవరేట్ అనడంతో అక్కడే ఫ్లాట్ అయ్యాను. మన ఇద్దరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, మీ అమ్మ అన్న మాటకు నేను పడిపోయా. నాకు మదర్ సెంటిమెంట్ ఎక్కువ అని అభిజిత్ అన్నాడు. అభిజిత్ నిర్ణయంతో సోహైల్‌, మోనాల్ సేవ్ కాగా అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్‌లు నామినేట్ అయ్యారు.
 
ఇదిలా వుండే అభిజీత్ టైటిల్ విన్నర్ ఫేవరెట్‌గా ఉన్నాడు. ఆడియన్స్ నుండి తనకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అలాగే బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ఇప్పటికే అభిజీత్ టైటిల్ ఫేవరెట్ అని చెప్పేసాడు. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా అభిజీత్‍కే తన ఓటు అని చెప్పేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్ అభిజీత్ అని తేల్చేసింది గూగుల్.
 
గూగుల్ సెర్చ్‌లో బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అని కొడితే అభిజీత్ పేరుని చూపించింది. ఇది వైరల్ అవ్వడంతో గూగుల్ తన తప్పును సరిచేసుకుంది. అభిజీత్ పేరుని సెర్చ్ నుండి తొలగించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు