'సంజు' షాకింగ్ ట్రెయిలర్... సంజయ్ దత్‌కు 308 మంది గర్ల్ ఫ్రెండ్సా?(Video)

సోమవారం, 4 జూన్ 2018 (15:50 IST)
తాజాగా తెలుగులో ఇటీవలే మహానటి సావిత్రి బయోపిక్ చిత్రం సంచలన విజయం సాధించన సంగతి తెలిసిందే. అట్లాగే ఇప్పటికే మహేందర్ సింగ్ ధోనీ బయోపిక్, రెజ్లర్ దీపా కుమారి బయోపిక్... విజయాలు సాధించాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న మరో బయోపిక్ నటుడు సంజయ్ దత్‌ది. రాజ్ కుమారి హిరాని తెరకెక్కిస్తున్న సంజయ్ దత్ బయోపిక్ సంజు అఫీషియల్ ట్రెయిలర్ ఇటీవలే విడుదలైంది.
 
ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. మరో విషయం ఏమిటంటే... ఈ ట్రెయిలర్లో సంజయ్ దత్ పాత్రధారి అయిన రణబీర్ కపూర్ తనక 308 మంది గర్ల్ ఫ్రెండ్స్ వున్నారని చెప్పడం. బయోపిక్ కావడంతో వక్రీకరించి చెప్పే అవకాశం లేదు. మరి రణబీర్ చెప్పినట్లు సంజయ్ దత్ కు నిజంగానే 308 మంది గర్ల్ ఫ్రెండ్స్ వుండేవారా అనే దానిపై చర్చ నడుస్తోంది. 
 
సంజయ్ దత్ తన జీవితంలో ఎత్తుపల్లాలు, చీకటివెలుగులు అన్నీ చూసినవాడే. ముంబై పేలుళ్ల కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. ఇకపోతే బయోపిక్ ట్రెయిలర్లో చెప్పినట్లు 308 మంది గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ చర్చ అయితే సాగుతోంది. 
 
సంజయ్ దత్‌కు మొదటి గర్ల్ ఫ్రెండ్ టినా మునిమ్. వీళ్లద్దరూ చాలాకాలం పాటు డేటింగులో వున్నారు. ఆ తర్వాత రియా పిళ్లైతో కొన్నాళ్లు కలిసి వున్నాడు. ఆ తర్వాత అతడి జీవితంలోకి రిచా శర్మ వచ్చింది. ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటీమణులతో లింకులున్నట్లు గాసిప్స్ కూడా వచ్చాయి. చివరిగా మాన్యతా దత్ ను పెళ్లాడి గర్ల్ ఫ్రెండ్స్ లిస్టుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. మరి ఈ మధ్యలో అతడితో కలిసి తిరిగిన 308 మంది ఎవరో? చూడండి సంజు అఫీషియల్ ట్రెయిలర్....

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు