నిర్మాతలు మాట్లాడుతూ.. మేం అనుకున్న దానికంటే ఈ సినిమా చాలా బాగా రావడంతో పాటు బిజినెస్ కూడా అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్ అందరూ మా సినిమాకు గురించి హ్యాపీగా ఉన్నారు. అయితే మేము సినిమా థియేటర్లు అన్ని ఓపెన్ అవుతాయి. మేము జనవరి 1న విడుదల చేయాలని అనుకున్నాం. కొన్ని థియేటర్ ప్రాబ్లమ్స్ వలన మా డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు మా చిత్ర్రాన్నిపోస్ట్ పోన్ చేస్తున్నాము. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు
కోవిడ్ టైంలో కూడా చిత్ర యూనిట్ అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేశాం. జనవరి 1న విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వలన సినిమాను విడుదల చేయలేకపోతున్నాం. ఎప్పుడు విడుదల చేయాలనేది త్వరలో తెలియజేస్తాము. ఈ సినిమా కామెడీ పరంగా అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడొచ్చినా.. చూసిన ప్రేక్షకులు 200% నవ్వుకుంటారనే నమ్మకం ఉందని అన్నారు
హీరోయిన్స్ మాట్లాడుతూ డైరెక్టర్ గారికి ఇది మొదటి సినిమా అయినా తను నిద్ర లేకుండా చాలా కష్టపడి పని చేశారు. షకలక శంకర్, దర్శక, నిర్మాతల సహకారం మరచిపోలేము. మేమందరం ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లి వచ్చినట్లు సినిమాను పూర్తి చేయగలిగాం. మేమంతా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.