పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక దైవాంశ సంభూతుడు అని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగిన "బ్రో" ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించాను. అదీ కూడా పవన్ కళ్యాణ్‌తో ఉంటుంది. ఆయనతో మరోమారు కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ విజయానికి మీరు అన్ని విధాల సహకరించాలని కోరుకుంటున్నా.
త్రివిక్రమ్ చెప్పగా ఆశ్చర్యపోయా..
తమిళనాడులో ఎక్కడో ఓ గ్రామంలో పుట్టి, ఇప్పుడు 'బ్రో' సినిమా ద్వారా మీ అందరి ముందు ఉండడానికి కారణం కాలం అని ఆ చిత్ర దర్శకుడు సముద్రఖని అన్నారు. నిజాయతీగా పనిచేస్తే ఎప్పుడూ విజయమే. ఈ సినిమా కాన్సెప్ట్ (తమిళ సినిమా వినోదాయ సిత్తం)ని ఓ రోజు త్రివిక్రమ్‌తో చెప్పగా వెంటనే తెలుగులో స్క్రిప్టు సిద్ధం చేశారు. పెద్ద హీరోతో సినిమా చేయాలనుందని మనసులో మాట బయటపెడితే 'పవన్ కల్యాణ్ ఓకేనా' అని అడిగారు. నేను ఆశ్చర్యపోయా. 70 రోజుల్లో చేయాల్సిన పనిని పవన్ 21 రోజుల్లో చేశారు. ఇది నా 15వ సినిమా' అని సముద్రఖని తెలిపారు.