ఇప్పుడు తాజాగా పవన్ వెనుక చిరంజీవి వున్నాడని నాదెండ్ల మనోహర్ చెప్పినట్లు వస్తున్న వార్త నిజమని తేలింది. ఇప్పుడు అన్నదమ్ము లిద్దరూ సినిమాల్లో బిజీగా వున్నారు. అందులో కొంత ఆర్థికంగా బలపడి ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో ఒకరికొకరు అండగా వుంటారని.. అప్పుడే పార్టీ బలోపితం అవుతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఫిలింనగర్ టాక్ ప్రకారం... చిరంజీవిని ఇటీవలే బిజెపి నాయకులు కూడా మర్యాదపూర్వకంగా కలవడం కూడా పెద్ద ఆలోచన వున్నట్లు చెబుతున్నాయి. బీజేపీతో పవన్ రెండోసారి కలసిన తర్వాత, సోము వీర్రాజు తన ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు మెగాస్టార్కు ధైర్యం వచ్చినట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే కాషాయంలోకి మార్చేసింది. రేపోమాపో చిరంజీవిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి సదరు సామాజిక వర్గానికి జనసేన-బీజేపీయే ఏకైక దిక్కు అనేలా సీన్ క్రియేట్ చేయబోతున్నారు.
కాగా, వి.సముద్ర దర్శకత్వంలో రేపు 29న విడుదలకాబోతున్న `జైసేన` సినిమాకూడా పవన్ ఆశయాలపైనే వుంది. అందులో రైతుల కోసం పవన్ ఎలుగెత్తి చాటిన సన్నివేశాలు, డైలాగ్‌లు కూడా ట్రైలర్‌లో గోచరిస్తున్నాయి. ఇది జైసే కాదు.. జనసేన.. అంటూ దర్శకుడు క్లారిటీగా చెప్పడం.. పార్టీ ఆశయాలు, తన ఆశయాలు ముందుముందు సినిమాలలలో చొప్పించనున్నట్లు తెలుస్తోంది. రేపు రాబోయే ఆచార్య కూడా అందుకు మినహాయింపుకాదనీ. రాజకీయ అంశాలు, సామాజిక అంశాలు అందులో వుంటాయని తెలుస్తోంది.