రాబోయే కాలంలో రొమాంటిక్ హీరోగా ఇలా చేయలేను : దుల్కర్ సల్మాన్

శనివారం, 12 ఆగస్టు 2023 (13:12 IST)
King On Kota
లవర్ బాయ్ గా చేస్తున్న ఈ హీరో అయినా మాస్ హీరోగా మారిపోతారు. మాస్ అనే పదంలోనే అంత కిక్ ఉంది. అందుకే తానూ కూడా రాబోయే కాలంలో రొమాంటిక్ హీరోగా హీరోయిన్ తో ఇలా చేయలేను అని దుల్కర్ సల్మాన్ తేల్చి చెప్పారు. మలయాళ ముమ్మూటీ వారసుడిగా వచ్చిన దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ గా చేరిన మలయాళ చిత్రం "కింగ్ ఆన్ కోతా", ఇదే తెలుగుతో పాటు పలు భాషల్లో విడుద కాబోతుంది. ఈ సందర్భంగా పి టి.ఐ. కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలిపారు. 
 
అతని రాబోయే మలయాళ చిత్రం "కింగ్ ఆన్ కోతా", ఇందులో దుల్కర్ సల్మాన్ ఆల్కహాలిక్ గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు, ఇది యాక్షన్ హీరోగా అతనికి  మొదటి భారీ విడుదల. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని దుల్కర్ అన్నారు. "నాకెప్పుడూ యాక్షన్ చేస్తానని పేరు రాలేదు, అది చాలా కష్టం. ఈ సినిమాలో నాలుగైదు ఫైట్స్ ఉన్నా.. లుక్, క్యారెక్టర్ పరంగా కూడా ఆ జోనర్ లో ఉండటం ఇంట్రెస్టింగ్ గా ఉంది" అన్నారాయన.
 
దుల్కర్ తన పదేళ్ల కెరీర్‌లో మణిరత్నం తమిళ హిట్ "ఓకే కన్మణి",  "సీతా రామం" (తెలుగు), హిందీలో "ది జోయా ఫ్యాక్టర్" వంటి రొమాన్స్ సినీమాలలో నటించాడు. గత నెలలో 37 ఏళ్లు నిండిన దుల్కర్ ఇక  తన జీవితంలోని తరువాతి దశాబ్దంలో యాక్షన్‌ను ఒక శైలిగా అన్వేషించాలనుకుంటున్నట్లు చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు