ఈ రోల్ చేసేందుకు ఒప్పుకున్న కృతికి ఈ సినిమా యూనిట్ ఎంతో రుణపడి ఉందని చెర్రీ చేసిన కామెంట్స్‌తో రకుల్ ప్రీత్ సింగ్ షాక్ అయ్యింది. ప్రస్తుతం నడుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ హవాతో పోలిస్తే కృతి క్రేజ్ టాలీవుడ్లో ఏమాత్రం లేకపోయినా చెర్రీ రకుల్‌ను ప్రశంసించకపోవడంపై రకుల్ షాక్ గురైందట. అంతేగాకుండా బాగా అప్సెట్ అయ్యిందని సమాచారం.
కాగా మెగా స్టార్ చిరంజీవి రకుల్ ప్రీత్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ రకుల్ చాలా బ్యూటిఫుల్ హీరోయిన్, సెన్సువల్ బ్యూటీ, ఎట్రాక్టివ్ గర్ల్ అంటూ తెగ పొగిడేసి సంచలనాలు సృష్టిస్తే చరణ్ మాత్రం ఈ సినిమాలో తనతో అక్క పాత్ర పోషించడానికి అంగీకరించిన కృతి కరబందను కొనియాడటం ఏంటని రకుల్ సన్నిహితులతో వాపోయిందట.