ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని ప్రేమించా.. బ్రేకప్ అయ్యింది.. ఇక పెళ్లిపై నమ్మకం లేదు: ఛార్మీ

సోమవారం, 26 మార్చి 2018 (16:07 IST)
ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి పెళ్లిపై నమ్మకం లేదంటోంది. ఇందుకు కారణం ఆమె జీవితంలో జరిగిన బ్రేకపేనని చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించానని.. రెండు విషయాల వల్ల ఆ ప్రేమ విఫలమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ రెండు కారణాల వల్ల తమ ప్రేమకు గండిపడిందని.. ఒకవేళ ఆ రెండు కండిషన్లకు తలొగ్గి వివాహం చేసుకుని వుంటే.. విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చేదని ఛార్మి తెలిపింది. 
 
తాను ప్రేమించిన వ్యక్తి మంచి వ్యక్తేనని.. కానే తానే చెడుదాన్ని అంటూ తెలిపింది. పెళ్లికి తర్వాత ప్రేమించిన వ్యక్తి కోసం సమయం కేటాయించలేనని.. ఇంటి పనులు చూసుకోలేకపోతానని భావించి ప్రేమకు కటీఫ్ ఇచ్చినట్లు ఛార్మీ తెలిపింది. ఇంకా చెప్పాలంటే, తమ సంబంధంలో ఎలాంటి స్పష్టత లేదు.. అందుకే విడిపోవాల్సి వచ్చిందని ఛార్మీ తెలిపింది. 
 
ఇక తనకు పెళ్లిపై నమ్మకం లేదని.. ఒక అబ్బాయిని చూసి ఇష్టపడే స్టేజ్‌లో తాను లేనని.. ఈ విషయాలన్నీ తన తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారని, అందుకే వారితో ఉండేందుకే ఇష్టపడతానని ఛార్మీ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌కు చెందిన  పూరీ కనెక్ట్స్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ఛార్మీ బిజీ బిజీగా గడుపుతోంది. తద్వారా ఒకప్పుడు తన అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఛార్మీ.. ప్రస్తుతం నిర్మాణ రంగంలో రాణిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు