ఈ సందర్భంగా దివంగత సీనియర్ నటుడు రావు గోపాల్ రావుతో ఉన్న పరిచయాన్ని ఓసారి గుర్తు చేసుకున్నారు. అల్లు రామలింగయ్య, రావు గోపాల రావులు అన్నదమ్ములు అయితే, రావు గోపాల రావు తనకు చిన్న మామయ్య అవుతారన్నారు.
ఆయన లంచ్ సమయంలో రావు గోపాల రావు ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తూ, ఆయన నా కోసం ప్రత్యేకంగా వంటకాలు తెచ్చి వడ్డించేవారని చెప్పారు. ముఖ్యంగా, వంకాయ కూర వడ్డిస్తే నేను తినడానికి ఇష్టపడేవాడిని కాదన్నారు.
ఇపుడు ఆయన లేని లోటను రావు రమేష్ తీర్చుతున్నారన్నారు. రావు రమేష్ నటనా నైపుణ్యాన్ని మెచ్చుకున్న చిరంజీవి, అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. ఆ మాటలు విన్న రావు రమేష్ ఉద్వేగానికిలోనై చిరంజీవి పాదాలను తాకారు.