మెగాస్టార్ చిరంజీవి బాహుబలి సంచలన దర్శకుడు రాజమౌళి ఇంటికి వెళ్లారు. ఇప్పుడిది టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. బాహుబలి చిత్రం రూ. 1500 కోట్ల మార్కు దాటి రూ.2000 కోట్ల మార్కు వైపు పరుగులు తీస్తోంది. దీనితో రాజమౌళి జాతీయ దర్శకుడు స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఈ నేపధ్యంలో చిరంజీవి నేరుగా రాజమౌళి ఇంటికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తర్వాత సినిమాను తనతో తీయాలని చిరు అడిగారని ఒకరంటుంటే, అల్లు అరవింద్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు దర్శకత్వం వహించాలని కోరేందుకు వెళ్లినట్లు మరికొందరు చెప్పుకుంటున్నారు. ఏదైతేనేం... రాజమౌళి ఇంటికి చిరంజీవి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.