ఇటీవల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోషన్ పోస్టర్‌కి చక్కని స్పందన వచ్చింది. బాస్ ఈజ్ బ్యాక్.. అందుకు తగ్గట్టే బాస్ అసలైన లుక్ ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్లో మెగాస్టార్ స్ట్రెయిట్ లుక్.. మ్యానరిజమ్స్‌ని ఆవిష్కరించే కొత్త స్టిల్స్ చూడాలన్న ఆసక్తిని ఫ్యాన్స్ కనబరిచారు. అందుకే ఈ దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్ పోస్టర్లను నిర్మాత రామ్‌చరణ్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ...'ఖైదీ నంబర్ 150.. మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ సోమవారం నుంచి పతాక సన్నివేశాల చిత్రీకరిస్తాం. సైమల్టేనియస్‌గా నిర్మాణానంతర పనులు పూర్తి చేస్తున్నాం. త్వరలోనే పాటల చిత్రీకరణకు యూనిట్ విదేశాలు వెళుతోంది. అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా 'ఖైదీ నంబర్ 150' చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. దీపావళి కానుకగా అభిమానుల ముందుకు కొత్త పోస్టర్లను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది' అన్నారు.