కొంతకాలంగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నందు వల్ల సినిమాలకు కాస్త విరామం ఇచ్చాను. అంతేకానీ అవకాశాలు లేకుండా కాదని.. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని కృష్ణ భగవాన్ చెప్పాడు. వంశీ దర్శకత్వం వహించిన 'మహర్షి' సినిమాలో శాంతిప్రియ భర్తగా నటించి సినీ పరిశ్రమకు పరిచయమైన కృష్ణభగవాన్.. కామెడీ నటుడిగా ఎదిగాడు.