తండ్రిపై లైంగిక ఆరోపణలు.. అయినా బాధితులకే మద్దతు : నందితా దాస్

బుధవారం, 17 అక్టోబరు 2018 (17:13 IST)
తన తండ్రిపై లైంగిక ఆరోపణలు వచ్చినప్పటికీ... తాను మాత్రం తన తండ్రికే మద్దతు ఇస్తానని ప్రముఖ సినీ నటి, దర్శకురాలు నందితా దాస్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ చిత్రపరిశ్రమను మీటూ ఉద్యమం కుదిపేస్తున్న విషయం తెల్సిందే.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'నా తండ్రి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అయినా ఇప్పటికి కూడా నేను మీటూకే మద్దతిస్తున్నాను. వేధింపులు ఎదుర్కొన్న బాధితులందరికి తోడుగా ఉంటాను. ఇక నా తండ్రి మీద వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. వాస్తవాలను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఆరోపణలు చేస్తున్న మహిళలు తమ మాటల పట్ల ఖచ్చితంగా ఉండాలి. తప్పుడు ఆరోపణలు చేస్తే ఈ ఉద్యమం దెబ్బతినే ప్రమాదం ఉంది' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, పేపర్‌ తయారు చేసే ఓ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు జతిన్‌ దాస్‌పై లైంగిక వేధిపుల ఆరోపణలు చేశారు. 14 ఏళ్ల క్రితం జతిన్‌ దాస్‌ తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆయన చేష్టలు చాలా 'వల్గర్'గా ఉన్నాయంటూ సదరు మహిళ ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు