శ్రీముఖి హోస్ట్‌గా వంట‌ల టాక్ షో - చెఫ్ మంత్ర - శ్రియా శ‌ర‌న్‌, న‌బా న‌టేశ్ కూడా సిద్ధం

గురువారం, 18 నవంబరు 2021 (18:36 IST)
Srimukhi, Rejina
ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుత‌మై ప్రోగ్రామ్స్‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా మ‌రో సరికొత్త, ఎగ్జ‌యిటింగ్ వంట‌ల టాక్ షో చెఫ్ మంత్ర‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మైంది. ఆహా ఇన్ హౌస్ క్రియేటివ్ టీమ్ డెవ‌ల‌ప్ చేసిన తొలి షో ఇది. ఫిక్ష‌న‌రి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రూపొందిస్తోన్న ఈ షోకు ప్ర‌ముఖ టెలివిజ‌న్ యాంక‌ర్‌, న‌టి శ్రీముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి శ్రీముఖి వంట‌ల‌ను బాగా ఆస్వాదించే వ్య‌క్తి. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోని చాలా మంది సెల‌బ్రిటీలు భావోద్వేగాలే కాకుండా మ‌రో కోణాన్ని చూస్తారు. సెల‌బ్రిటీలో ఈ షోలో పాల్గొని వంట‌లతో వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోనున్నారు. 
 
చెఫ్ మంత్ర ప్రోగ్రామ్‌కు ప్రీతి అప్లాయెన్‌సెస్ స‌మ‌ర్ప‌కులుగా .. అలాగే ఫ్రీడ‌మ్ ఆయిల్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ స‌హ నిర్మాణంలో, సిద్ ఫార్మ్స్ డెయిరీ పార్ట‌న‌ర్‌, తెనాలి డబుల్ హార్స్ స్పెష‌ల్ పార్ట‌న‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 
 చెఫ్ మంత్ర.. ఈ సీజ‌న్‌లో 8 ఎపిసోడ్స్‌గా అల‌రించ‌డానికి సిద్ధ‌మైంది. పాపుల‌ర్ తెలుగు ఫిల్మ్ స్టార్స్‌, వారి అభిమాన చెఫ్స్ క‌లిసి ఇష్ట‌మైన వంట‌ను చేయ‌డ‌మే కాకుండా, వారి ప్ర‌యాణంలోని జ్ఞాప‌కాల‌ను నెమ‌ర‌వేసుకోబోతున్నారు. సెల‌బ్రిటీలు ఎంపిక చేసుకునే ఫ‌డ్ వారి జీవ‌న శైలి, వ్య‌క్తిత్వాల‌ను తెలియ‌జేసేవిగా ఉంటాయి. అంతే కాకుండా స‌ద‌రు సెల‌బ్రిటీల్లో స‌ర‌దా కోణాన్ని కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌న్నారు నిర్వాహ‌కులు. 
 
ఈ ప్రోగ్రామ్‌లో తొలి ఎపిసోడ్‌ బుధ‌వారం అంటే న‌వంబ‌ర్ 17న ప్ర‌సారం కానుంది. ఇందులో రెజీనా క‌సాండ్ర పాల్గొన్నారు. ఇంకా ఈ ప్రోగ్రామ్‌లో శ్రియా శ‌ర‌న్‌, సుహాస్‌, న‌బా న‌టేశ్‌, అడివి శేష్ త‌దిత‌రులు వీక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నారు. గ‌తంలో ఢీ, సారెగ‌మ‌ప‌,, బిగ్ సెల‌బ్రిటీ ఛాలెంజ్ టెలివిజ‌న్ షోస్‌తో అసోసియేట్‌గా వ‌ర్క్ చేసిన నాగ‌రాజు క‌ట్టా ఈ షో ను డైరెక్ట్ చేశారు. పాపుల‌ర్ చెఫ్‌, క‌న్‌స‌ల్‌టెంట్ ఆమీ ఫుడ్ స్టైలిష్ట్‌గా ఉన్నారు. మీడియాకు సుప‌రిచితులైన‌ ప్ర‌భు కిషోర్, కుమార్ ఈ షోకు రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా ప్రీతి అప్ల‌యెన్‌సెస్ మార్కెటింగ్ హెడ్ శ్వేతా సాగ‌ర్ మాట్లాడుతూ ‘‘ ప్రీతి అప్ల‌యెన్‌సెస్ నాలుగు ద‌శాబ్దాలుగా క‌స్ట‌మ‌ర్స్‌కు సేవ‌ల‌ను అందిస్తోంది. వంట‌ల‌ను సుల‌భ‌త‌రంగా చేయ‌డానికి అవ‌స‌ర‌మైన అప్ల‌యెన్‌సెస్‌ను ప్రీతి అందిస్తోంది. తరాలుగా మన భారతీయుల వంటింటితో మాకు అనుబంధం ఏర్ప‌డింది. ఇప్పుడు డిజిటైజేష‌న్ అనేది ప్ర‌స్తుత మార్కెట్ డైమ‌న్ష‌న్‌ను, క‌స్టమ‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పును తీసుకొస్తుంది. ఈ క్ర‌మంలో ఆహా తో క‌లిసి ఈ ప్రోగ్రామ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. డిజిట‌ల్ మాధ్య‌మంలో విస్తృత‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌డంలో ఆహా త‌న‌దైన పాత్ర‌ను పోషిస్తోంది. చెఫ్ మంత్ర షో ద్వారా మా క‌స్ట‌మ‌ర్స్‌ను ప‌ల‌క‌రించే వీలుంటుంది. మా ప్రొడ‌క్ట్స్‌తో వంట చ‌య‌డం వ‌ల్ల పొందే కుకింగ్ ఎక్స్‌పీరియెన్స్‌, ఆనందాన్ని వారికి ఇష్ట‌మైన సెల‌బ్రిటీ ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంద‌నేది మ‌నం చూడ‌బోతున్నాం’’ అన్నారు. 
 
ఫ్రీడమ్ ఆయిల్ సేల్స్‌, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్ర శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా రైజ్ బ్రాండ్ ఆయిల్‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తూనే ఆరోగ్యంగా ఉండేందుకు మా రైస్ బ్రాండ్ ఆయిల్ ఎలా దోహ‌ద‌ప‌డుతుంద‌నే విష‌యాన్ని తెలియ‌జేయ‌డానికి ఆహా స‌రైన వేదిక‌గా మేం భావిస్తున్నాం. మంచి ఆహారంపై ఉండే ఇష్టం. అది కూడా మ‌న‌కు ఎంతో ఇష్ట‌మైన సెల‌బ్రిటీలు ఆ వంట‌ను వండటం, అదే స‌మ‌యంలో ఆరోగ్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్య‌త‌ను వారు తెలియ‌జేయ‌డం  అనే విష‌యాల‌ను అంద‌రూ ఎంతో ఇష్ట‌ప‌డ‌తారన‌డంలో సందేహం లేదు. ఈ ప‌ద్ధ‌తిలో మా ఫ్రీడమ్ రైజ్ బ్రాండ్ ఆయిల్‌ను ప్ర‌తిరోజూ వంట‌కాల్లో ఉప‌యోగించాల‌ని మేం తెలియ‌జేస్తాం. ఆహాకు ఉన్న విస్తృత‌మైన గుర్తింపు ద్వారా మా ఫ్రీడ‌మ్‌ రైజ్ బ్రాండ్ ఆయిల్ ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేస్తాం. దీని ద్వారా ఫ్రీడ‌మ్ టు ఈట్‌, ఫ్రీడ‌మ్ టు ఎంజాయ్ అనే విధానాన్ని జ‌నాల్లోకి మ‌రింత‌గా తీసుకెళ‌తాం’’ అన్నారు. 
 
స్విగ్గీ హెడ్ ఆశిష్ లింగ‌మ‌నేని మాట్లాడుతూ ‘‘చాలా ఏళ్లుగా ఆన్‌లైన్ సేవ‌ల ద్వారా మా క‌స్ట‌మ‌ర్స్‌కు ఆహారాన్ని అందిస్తున్నాం. ఈ క‌మిట్‌మెంట్‌ను నిలుపుకుంటూ రావ‌డమ‌నేది ఒక గొప్ప అనుభూతి. దీన్ని మ‌రింత‌గా ముందుకు తీసుకెళ్లే క్ర‌మంలో ఆహా వారి చెఫ్ మంత్ర‌తో భాగ‌స్వామ్యం కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను క‌స్ట‌మ‌ర్స్‌కు అందించ‌డానికి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను ప్రారంభించాం. సెల‌బ్రిటీలు, హోస్ట్‌, చెఫ్‌లు ఎవ‌రైనా ప‌దిహేను నుంచి ముప్పై నిమిషాల‌లో వారు వండే వంట‌ల‌కు సంబంధించిన వ‌స్తువుల‌ను మా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా పొంద‌వచ్చు’’ అన్నారు. 
 
నితిన్ బ‌ర్మాన్, ఆహా నాన్ స‌బ్‌స్క్రిప్ష‌న్ రెవెన్యూ హెడ్  మాట్లాడుతూ ‘‘ఇదొక స్టోరీ టెల్లింగ్ లాంటిది. దీనితో అందరికీ అద్భుతంగా కనెక్ట్ కావచ్చు. నాన్ ఫిక్షన్ పద్ధతిలో  ఉండే ఈ కథ‌ల‌కు గొప్ప‌గా అనిపిస్తుంటాయి. మా ఆహా ఇన్ హౌస్ క్రియేటివ్ టీమ్ చేసిన తొలి షో చెఫ్ మంత్ర‌. ప్రీతి అప్ల‌యెన్‌సెస్‌, ఫ్రీడ‌మ్ ఆయిల్‌, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌, సిద్ ఫార్మ్స్‌, తెనాలి డ‌బుల్ హార్స్ వంటి వారితో క‌లిసి ఈ షో చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. త‌ప్ప‌కుండా ఇది అంద‌రినీ మెప్పిస్తుంది’’ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు