అమర జవాన్ల కోసం ఏకమైన బాలీవుడ్... తు దేశ్ మేరా...

గురువారం, 15 ఆగస్టు 2019 (16:15 IST)
గత ఫిబ్రవరి 14వ తేదీన దేశం యావత్తూ వణికిపోయింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఐఈడీతో దాడి చేసి మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో 49 మంది జవాన్లతో పాటు.. మొత్తం 57 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గత మూడేళ్ళలో జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. 
 
అయితే ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప‌లు వ‌ర్గాల‌కి చెందిన ప్ర‌ముఖులు అమ‌రులైన కుటుంబాల‌కి త‌మ‌కి తోచినంత విరాళాన్ని అందించారు. అదేసమయంలో ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానులకు నివాళి అర్పించేందుకు బాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చారు. 
 
అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారుఖ్, అభిషేక్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్య రాయ్, కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ వంటి ప్రముఖులు దేశ సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ సీఆర్‌పీఎఫ్‌తో కలిసి వారికి శ్రద్ధాంజలిగా వీడియో పాట రూపొందించారు. 
 
ఏప్రిల్‌లోనే సాంగ్‌కి సంబంధించిన షూటింగ్ మొద‌లు కాగా, అప్ప‌ట్లో మేకింగ్ విజువ‌ల్స్‌ని సీఆర్‌పీఎఫ్ తమ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. ఈ రోజు దేశ 73వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని 'తు దేశ్ మేరా' అంటూ సాగే పాట‌ని మ‌రి కొద్ది నిమిషాల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు