సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తమపై అసభ్యకర పోస్టులు చేసిందని ఆరోపిస్తూ నటి కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ ఇటీవల హైదరాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిగా శ్రీరెడ్డి కూడా కరాటే కల్యాణి, డ్యాన్స్ మాస్టర్ రాకేశ్‌లపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
సినీ నటి శ్రీరెడ్డి, ఆమె అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను చంపుతానని యూట్యూబ్, ఫేస్‍బుక్ ద్వారా బెదిరిస్తున్నారంటూ రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన అభిమానులు అపార్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.