ఈ సందర్భంగా హీరో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఒక రూమ్‌లో ఒక సినిమాని రెండు గంటల సేపు ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా రిస్క్. అలాంటి కథను నా భుజాన పెట్టి నాతో చేయించాడు దర్శకుడు వెంకట్ చంద్ర.ఈ సినిమా నిజంగా నా జీవితానికి అర్థం చెప్పే సినిమా అవుతుంది.ఈ సినిమా తర్వాత నాకు ప్రేక్షకులనుండి మంచి రెస్పెక్ట్ వస్తుంది. ఈ రెస్పెక్ట్ కోసమే నేను 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. సంగీత దర్శకుడు లైనస్ అద్భుతమైన మ్యూజిక్, రీ రికార్డింగ్ ఇచ్చాడు. తమిళ్ లో పార్థీబన్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసి నేషనల్ అవార్డు సాధించిన "ఉత్త సిరుప్పు సైజు 7" సినిమాను తెలుగులో నేను చెస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా చిత్రానికి సపోర్ట్ చేస్తూ ట్రైలర్, పోస్టర్ ను విడుదల చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి,హరీష్ శంకర్‌కి ధన్యవాదాలు. మే 20 న వస్తున్న ఈ సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను అన్నారు
దర్శకుడు వెంకట్ చంద్ర మాట్లాడుతూ ..బండ్ల గణేష్ ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశాడు.సినిమా విడుదలైన తరువాత బండ్ల గణేష్ ఇంత బాగా నటించగలుగుతాడా అనేది సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతారు.లైనస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను అన్నారు.
ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), కళా దర్శకత్వం: గాంధీ, కూర్పు: ఎస్.బి. ఉద్దవ్, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, కథ: ఆర్. పార్తిబన్, మాటలు: మరుధూరి రాజా, వైదేహి, సంగీతం: లైనస్ మధిరి, సమర్పణ: రిషి అగస్త్య, నిర్మాణ సంస్థ: యష్ రిషి ఫిలిమ్స్ దర్శకత్వం: వెంకట్ చంద్ర, నిర్మాణం: స్వాతి చంద్ర.