తాజాగా అందాల రాక్షసి చిత్రంతో దర్శకునిగా పరిచయమై.. ఆపై నానితో కృష్ణగాడి వీర ప్రేమగాధతో మంచి హిట్ సాధించిన హను రాఘవపూడి వివాహం కూడా త్వరలో అట్టహాసంగా జరుగనుంది. ఇష్క్, మనం 24 వంటి సినిమాలకు దర్శకునిగా వ్యవహరించిన విక్రమ్ కె. కుమార్ కూడా ఓ ఇంటివాడవుతున్నాడు.
కాగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్‌కు సెలవిచ్చి.. హైదరాబాదుకు చెందిన డాక్టర్‌ను క్రిష్ పెళ్ళాడిన సంగతి తెలిసిందే. త్వరలోనే క్రిష్ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక విక్రమ్ కుమార్ వివాహం డిసెంబరులో జరుగనుందని, హను రాఘవపూడి కూడా క్రిష్ తరహాలోనే హైదరాబాద్ డాక్టర్ అమూల్యని పెళ్ళాడనున్నాడు.