బెంగళూరు నిర్మాతతో సంబంధాలు అంటూ యువహీరో తనీష్ పై పలు చానెళ్లు కథనాలు ప్రచారం చేయడాన్ని ఆయన ఓ వీడియో ద్వారా ఖండించారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అంటూ ఇష్టానుసారం ప్రచారం చేసేశారు. ఇందులో నిజానిజాలేమిటో తెలుసుకునేందుకు కనీసం నన్ను సంప్రదించలేదు.. నా కుటుంబాన్ని ఆ వార్తలు తీవ్రంగా బాధించాయి`` అంటూ వాపోయారు తనీష్. బెంగళూరు నిర్మాతకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చిన మాట నిజం. నాకు నోటీసు వచ్చింది. కానీ నాకు వచ్చిన నోటీసు అర్థం ఏమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారం కొన్ని మీడియాలు ప్రచారం చేయడం నా కుటుంబాన్ని బాధించిందని తనీష్ అన్నారు. అసలు బెంగళూరు నిర్మాతతో రెండేళ్లుగా ఎలాంటి సంప్రదింపులు లేవు అని తెలిపారు.