బాలీవుడ్‌లో బ్రేకప్ ఎపిసోడ్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రణ్ బీర్ కపూర్, కత్రీనాల బ్రేకప్ వార్తలు బిటౌన్లో షికార్లు చేస్తున్నాయి. అలాగే హృతిక్ రోషన్- కంగనా రనౌత్‌ల వార్ ఓ వైపు నడుస్తోంది. ఈ విషయాన్ని ప్రైవేట్‌గా డీల్ చేసుకుంటామని.. బహిరంగంగా ఎలాంటి ప్రకటనలుండవని కంగనా స్టేట్మెంట్ ఇచ్చేసింది. అయితే కంగనా స్టేట్మెంట్ కంటే ముందు హృతిక్ మాజీ భార్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
హృతిక్‌తో వివాదం నేపథ్యంలో కంగనా అందించిన ఆధారాలు ఫోటోషాప్ బాపతేనని తేల్చేసింది. తద్వారా హృతిక్ విషయంలో కంగనా ఎపిసోడ్‌కు ఫుల్ స్టాఫ్ పెట్టినట్లైంది. మరోవైపు హృతిక్, పిల్లలతో పాటు సుసానే ఓ అబ్రాడ్ టూర్ వెళ్లింది. వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోతున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు దీనిపై కూడా సుసానే ఓ క్లారిటీ ఇచ్చేసింది.