రాజమౌళితో సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది?
రాజమౌళిగారితో సినిమా చేయడం అంటే 25 సినిమాలు చేసిన అనుభవం వస్తుంది.
సర్కారువారిపాటలో మీరేం నేర్చుకున్నారు?
మామూలుగా సినిమా అంటేనే 6,8 నెలలు అనుకుంటాం. కానీ కరోనా వల్ల రెండేళ్ళు పట్టింది. ఈ రెండేళ్ళలో చాలా మార్పులు సంభవించాయి. షూటింగ్‌లోనూ చాలా విసయాలు తెలుసుకున్నాను.
ప్రీరిలీజ్ వేడుకలో మీరు భావోద్వేగానికి గురయ్యారు?
అవును. రెండేళ్ళలో నా అనుకున్నవారు దూరమయ్యారు. అది చాలా భరించలేనిది. అది అనుభవంలోకి వచ్చినవారికే తెలుస్తుంది. అందుకే ఆరోజు ఒకసారి గుర్తు చేసుకున్నాను.
కళావతి సాంగ్ మీరు వద్దన్నారట?
కళావతి పాట చాలా నిదానంగా సాగుతూ, అమ్మాయి వెంటపడే సాంగ్. ఇది నా స్థాయికి కరెక్టేనా అనే అనుమానం కలిగింది. ఆ విషయం థమన్‌కు చెప్పాను. దర్శకుడు కూడా ఆలోచనలో పడ్డారు. అయితే థమన్ ససేమిరా అంటూ.. నా మాట వినండి.. ఈ పాట ప్రతి ఊరిలో పెండ్లిల్లలో వినేపాట అవుతుందన్నాడు. ఆ సాంగ్ ఆయన చెప్పినట్లు ఎంతో పాపులర్ అయింది. థమన్ ప్రేక్షకుల నాడి బాగా పసిగట్టాడు.