అమెరికా చరిత్రలో ఇంత కలర్ ఫుల్, స్వేచ్ఛగా మాట్లాడే వ్యక్తి మరొకరు లేరని డొనాల్డ్ ట్రంప్, ఓ బాల్ థాకరే, ఓ కేసీఆర్, ఓ లాలూ ప్రసాద్ యాదవ్‌లు కలిస్తే, అతనే డొనాల్డ్ ట్రంప్ అవుతారని అన్నారు. ట్రంప్ అధ్యక్షుడు కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలో వర్మ ట్వీట్ చేశాడు.
తన సినిమాల ద్వారా సమాజానికి సందేశం ఇవ్వాలనో లేక వారికి క్లాసులు పీకాలనో ఆలోచన తనకు లేదని, సినిమా తనకు అన్నం పెడుతుంది కనుక తీస్తున్నానని ఆయన అన్నారు. తనకు సమాజం పట్ల అంతే బాధ్యత ఉందని.. అసలు బాధ్యత ఉందని చెప్పుకునే వారికంటే ఎక్కువ బాధ్యత తనకే ఉందని వర్మ స్పష్టం చేశారు. అయినా తనకు అర్థం కాని విషయం ఏంటంటే...తన సినిమాలో తాను ఏదో చెబితే కమ్మలు, కాపులు ఎందుకు కొట్టుకుంటారని ప్రశ్నించారు.