టర్కీ గ్లోబల్ కల్చర్ అంబాసిడర్ గౌరవాన్ని అందుకున్న డాక్టర్ నరేష్ విజయకృష్ణ

సోమవారం, 9 అక్టోబరు 2023 (09:07 IST)
Receiving turky award
ప్రముఖ సినీ నటుడు డాక్టర్ నరేష్ విజయకృష్ణ చిత్ర పరిశ్రమలో తన 50 ఏళ్ల స్వర్ణోత్సవం సందర్భంగా టోకట్ నగరంలో హష్మీ గ్రూప్ & టర్కీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఇండో టర్కిష్ ఫెస్టివల్ ఆఫ్ కల్చర్స్ ఈవెంట్‌లో టోకట్ గవర్నర్, సెక్రటరీ జనరల్ చేతుల మీదుగా ప్రపంచ సాంస్కృతిక రాయబారి( గ్లోబల్ కల్చర్ అంబాసిడర్) బిరుదు, గౌరవాన్ని అందుకున్నారు.
 
నరేష్‌కు టర్కీ, అనేక ఇతర దేశాలతో మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. నరేష్ యునైటెడ్ నేషన్స్‌లో వింగ్ అయిన UNIGO icdrhrp లో కౌన్సెల్ జనరల్‌గా క్రియాశీలకంగా వున్నారు.
 
సినిమా పరిశ్రమకు సేవ అందించడంలో భాగంగా ఆయన టర్కీ, ఇతర దేశాలలో సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
 
నటుడు శివ బాలాజీ (మా కోశాధికారి) హీరో సుమన్, బాలీవుడ్ నుండి చాలా మంది గాయకులు, మేయర్లు తదితరులు ఈ కార్యక్రమమలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు