కెరీర్ మొదట్లో నా డ్రీమ్ నెరవేరింది - సాయి మంజ్రేకర్
గురువారం, 2 జూన్ 2022 (18:09 IST)
Saiee Manjreka
అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. జూన్ 3న చిత్రం విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా కథానాయిక సాయి మంజ్రేకర్ మీడియాతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలు.
మేజర్ చిత్రంలో మీ పాత్ర ఎలా వుంటుంది?
నార్త్ ఇండియన్ అమ్మాయి ఇషా పాత్ర పోషించాను. సందీప్ ఉన్నికృష్ణన్ చైల్డ్ హుడ్ గాళ్ ఫ్రెండ్‌గా నటించాను. నార్త్ నుంచి బెంగుళూరు వచ్చాక ష్కూల్ డేస్‌లో ఆయనతో గడిపిన క్షణాలు చాలా ఇన్‌స్పైర్‌గా వుండేవి.
ఆ పాత్ర చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
మొదటి రోజు షూట్‌లో చాలా కన్‌ఫ్యూజ్‌లో వున్నాను. తెలుగులో షూట్ చేయడం వల్ల నాకు తెలుగు తెలీదు. ఫస్ట్ రోజు నేను డైలాగ్స్ చెబుతూ సీన్ చేస్తుంటే సెట్లో అందరూ నవ్వేశారు. నాకు టెన్షన్ మొదలైంది. తర్వాత షెడ్యూల్ నుంచి నాపై నాకే కాన్‌ఫిడెన్స్ పెరిగింది.
మహేష్‌బాబు బేనర్‌లో నటించడం ఎలా ఫీల్ అవుతున్నారు?
నేను నటిగా చేసిందే మూడు సినిమాలు. మొదట సల్మాన్‌తో చేశాను. రెండోది అల్లు అర్జున్ బేనర్‌లో గని చేశాను. మహేష్‌బాబు బేనర్‌లో మేజర్ చేశాను. ఇలా పెద్ద బేనర్‌లో చేయడం డ్రీమ్ కమ్ ట్రూలా జరిగిపోయింది.
సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబాన్ని కలిశారా?
సందీప్ తల్లిదండ్రులను బెంగుళూరు కలిశాను. ఆయన మదర్‌ను చూడగానే నా మదర్ గుర్తుకు వచ్చింది. చాలా గౌరవప్రదమైన మనుషులు. వారి మాట్లలో నిజాయితీ ఆప్యాయత కట్టిపడేశాయి.
సినిమా చూశాక వారి పేరెంట్స్ ఎలా ఫీలయ్యారు? మీరు గమనించారా?
సందీప్ ఉన్నికృష్ణన్ కజిన్, లక్ష్మీ ఆంటీ చాలా ఇంప్రెస్ అయ్యారు. నేనైతే చాలా గొప్పగా ఫీలయ్యాను.
మేజర్ మిమ్మల్ని ప్రపోజ్ చేశారా? మీరు చేశారా?
అది సినిమా చూస్తేనే బాగుంటుంది. ఒకరినొకరు ప్రపోజ్ చేసుకున్నాం. మాది స్వీట్ లవ్ స్టోరీ. చూసేవారు కనెక్ట్ అవుతారు.
మేజర్‌లో మీది స్క్రీన్ స్పేస్ ఎంత వుంది?
స్క్రీన్ స్పేస్ ఎంత అనేది లెక్కపెట్టలేదుకానీ, ఆ పాత్ర చేయడం చాలా ఆనందంగా వుంది. 16 ఏళ్ళ నుంచి సందీప్‌ను చూసి ఇన్‌స్పైర్ అయ్యేవిధానం నేను ఆర్కిటెక్ కావాలనే కోరిక వుండడం. ఇవన్నీ సినిమాలో చాలా ఎలివేట్ అవుతాయి. సహజంగా ఒక సినిమాలో నటికి ఒక షేడ్ మాత్రమే వుంటుంది. కానీ మేజర్‌లో నా పాత్రలో పలు షేడ్స్ వుంటాయి.
నమ్రతగారిని కలిసినప్పుడు ఏమన్నారు?
నమ్రత మా నాన్నగారికి బాగా తెలుసు. నా పాత్ర గురించి ఆమెకు బాగా తెలుసు. మా అమ్మకూడా నాతోనే వుంది. నెరేషన్ చెప్పగానే మా అమ్మ ఏడ్చేసింది. అలా ఫీలయింది.
బెంగుళూరులో మీరు సినిమా చూశారుకదా. మీరు బాగా ఎట్రాక్ అయిన సందర్భాలున్నాయా?
రేవతి మేడమ్ పాత్ర బాగా ఎట్రాక్ట్ చేసింది. ఆమె పాత్ర హృదయాలను టచ్ చేస్తుంది.
మేజర్ షూట్‌లో ఏం నేర్చుకున్నారు.
మొదట్లో భయపడ్డాను. తెలుగు అర్థంకాలేదు. నేను షూట్ చేస్తుండగానే నవ్వేశారు. ఆ తర్వాత ప్రతీదీ అబ్జర్వ్ చేసుకున్నాను. తెలుగు నేర్చుకుని నేనే డబ్బింగ్ చెప్పేస్థాయికి చేరుకున్నాను.
అడవిశేష్‌తో నటించడం ఎలా అనిపించింది?
తను నాకు చాలా హెల్ప్ చేశాడు. ఫోన్ కాల్ సీక్వెల్‌లో ..ఎలా పెర్‌ఫార్మ్ చేయాలో చేసి చూపించాడు. అలా కొన్ని సందర్భాల్లో బాగా అండగా నిలిచాడు.
శోభితాతో మీకు సన్నివేశాలున్నాయా?
పెద్దగా లేవు. ఇద్దరివీ ప్రధానమైన పాత్రలే.
రష్ చూశాక మీ డబ్బింగ్ ఎలా అనిపించింది?
బాగానే చెప్పాననించింది. నార్త్ నుంచి వచ్చిన అమ్మాయి గనుక తెలుగు యాస కాస్త స్టయిలిష్‌గా వేరుగా వుంటుంది. దాన్ని పలకడంలో నాకు దర్శకుడు, శేష్ బాగా హెల్ప్ చేశారు.
తెలుగులో సినిమాలు చేశారు కదా? తెలుగు సినిమా గురించి మీరేమనుకుంటున్నారు?
ఇక్కడ పీపుల్ చాలా మర్యదగా, గౌరవంగా వుంటారు. సెట్లో అందరూ డెడికేషన్‌తో పనిచేయడం గమనించాను. హార్డ్ వర్కింగ్ చూశాను. హైదరాబాద్ కల్చర్ నాకు చాలా బాగుంది.
మీ ఫాదర్ ఏవైనా టిప్స్ ఇచ్చారా?
డైలాగ్స్ పలికేటప్పుడు ఎలా పలకాలో, దీర్ఘాక్షరాలు, దీర్ఘంలేనివి ఎలా ఉచ్చరించాలో చెప్పారు.
వరుణ్‌తేజ్ గని అనుకున్నంత హిట్ కాలేదు ఎలా రిసీవ్ చేసుకున్నారు?
వరుణ్‌తేజ్ నైస్ హ్యూమన్ బీయింగ్. తను చాలా కష్టపడే మనిషి. హిట్ ప్లాప్ అనేది మన చేతుల్లో లేదు.
లేడీ ఓరియెంట్ చిత్రాలు చేస్తారా?
ఇప్పటికే మూడు సినిమాలు చేశాను. నేను ఏది చేయగలను. చేయలేను అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ అలాంటివి వస్తే స్వీకరిస్తాను.
దర్శకుడు శశికిరణ్ తిక్క గురించి చెప్పండి?
తను చాలా విజన్ వున్న దర్శకుడు. సాఫ్ట్‌గా వుంటాడు. కానీ చెప్పాలనుకున్నది స్పష్టంగా వుంటుంది. నటీనటులనుంచి కావాల్సింది రాబట్టుకుంటాడు. ఏ డౌట్ వచ్చినా అడిగితే ఓపిగ్గా సమాధానం చెబుతాడు.
తదుపరి చిత్రాలు?
ఇంకా ఏవీ ఫైనల్ కాలేదు. తెలుగులో అడుగుతున్నారు. త్వరలో చెబుతాను.