తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకు కొత్త గండమొచ్చిపడింది. కబాలి సినిమాకు పొలిటికల్ గండం తప్పదని సినీ విశ్లేషకులు అంటున్నారు. వివరాల్లోకెళితే ‘కొచ్చడయాన్’ (తెలుగులో విక్రమసింహ), ‘లింగ’ సినిమాలు పరాజయం పాలవడంతో తర్వాతి సినిమాకి ఆ ఫలితం రాకూడదనే ఉద్దేశంతో రజనీ అగ్ర దర్శకులను కాదని యువ దర్శకుడు రంజిత్‌తో 'కబాలి' మొదలెట్టారు.
అయితే తమిళనాడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతానికి ఆ పనులను మానుకోమని చెప్పారట రజనీ. ఎన్నికల తేదీపై క్లారిటీ వచ్చేవరకు వేచి చూసి అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో కబాలి సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇకపోతే కబాలి టీజర్ ఈ నెల 24న విడుదల కానుంది.