''బ్లాక్ రోజ్'' ఫస్ట్ లుక్.. ఊర్వశీ రౌతేల గ్లామర్ అదుర్స్

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (13:08 IST)
Black Rose
బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అందాల భామ ఊర్వశీ రౌతేల తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా చేయకుండా 'బ్లాక్ రోజ్' కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి ఈ చిత్రం చేయడానికి అంగీకరించింది. ఆగస్ట్ 17నుంచి నిర్విరామంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రెండుసార్లు మిస్ ఇండియా కిరీటాన్ని సాధించిన ఊర్వశీ రౌతేల బ్లాక్ రోజ్ ద్వారా అందాలను ప్రదర్శించనుంది. 
 
పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తమ సొంత బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నంబర్‌ 4గా 'బ్లాక్ రోజ్' సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. 
 
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. షేక్స్‌పియర్ రచించిన 'ద మర్చంట్ ఆఫ్ వెనిస్'లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా 'బ్లాక్ రోజ్' తెరకెక్కుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు