వివి వినాయక్ నటుడి అవతారం ఎత్తాడు. తాజాగా అతడు హీరోగా నటించే సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ లుక్‌లో వినాయక్ స్టైల్ అదిరింది. వివినాయక్ దర్శకుడిగా అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్, దిల్ రీసెంట్గా ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలు వినాయక్ తీసిన సినిమాల్లో ఉత్తమ చిత్రాలని చెప్పవచ్చు.
వినాయక్ లుక్ సైతం అంతే మాస్‌గా ఉన్నది. చేతిలో ఓ రెంచ్, మెడలో రెడ్ కలర్ టవల్‌తో సీరియస్ లుక్‌లో వున్న ఫోటో ప్రస్తుతం రిలీజ్ అయ్యింది. వివి వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.