ఎఫ్-3 ఐదుగురు హీరోయిన్‌లా.. ప్రస్టేషన్ మామూలుగా వుండదుగా..!

శుక్రవారం, 11 డిశెంబరు 2020 (15:20 IST)
F2
ఎఫ్-2 గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019 సంక్రాంతి హిట్ అయిన ఎఫ్-2 సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఎఫ్-2లో హీరోహీరోయిన్లుగా నటించిన విక్టరీ వెంకటేష్ - మిల్కీ బ్యూటీ తమన్నా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - స్టన్నింగ్ బ్యూటీ మెహ్రీన్‌లు ఎఫ్-3లోనూ నటిస్తారని తెలిసింది. ఎఫ్-2ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 14 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇంకా 2021 వేసవిలో ఎఫ్3 థియేటర్లలో సందడి చేయనుంది. 
 
ఇకపోతే.. ఈ సీక్వెల్‌లో ఎఫ్ 2కి మించిన కామెడీనే కాదు.. గ్లామర్ కూడా ఉంటుందని టాక్. తమన్నా, మెహ్రీన్‌తో పాటు మరో ముగ్గురు నాయికలు కూడా ఎఫ్ 3లో సందడి చేస్తారని తెలిసింది. అందులో ఒకరు ప్రత్యేక గీతంలో మెరిస్తే.. మరొకరు వెంకీకి ప్రియురాలిగా, ఇంకొకరు వరుణ్‌కి లవర్‌గా దర్శనమిస్తారట. మొత్తానికి.. ఐదుగురు హీరోయిన్స్‌తో ఎఫ్-3 మొత్తం ఫన్ అండ్ ప్రస్టేషన్‌గా మారనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు