జి 2 తో ఆల్ ఇండియా ఫ్రాంచైజ్ గా మారబోతుంది : అడివి శేష్

మంగళవారం, 10 జనవరి 2023 (19:02 IST)
Adivi Shesh, TG Vishwa Prasad, Abhishek Aggarwal, Vinay
గూఢచారి 116 సినిమాతో తెలుగులో స్పై చిత్రాలకు బీజం వేశారు సూపర్‌ స్టార్‌ కృష్ణ. ఆయన్ను తలచుకుంటూ లేటెస్ట్‌గా ‘జి2’ (గూఢచారి 2) చిత్రం రూపొందబోతోంది. ఇంతకుముందు గూఢచారి చిత్రం అడవిశేష్‌ హీరోగా రూపొందింది. ఇప్పుడు జి2 చిత్రం రూపొందబోతోంది. దీనికి సంబంధించి ముంబైలో అడవిశేష్‌ ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే నిర్మాతలు లాంఛ్‌ చేశారు. ఈ వివరాలను తెలియజేసేందుకు మంగళవారంనాడు హైదరాబాద్‌లో చిత్ర యూనిట్‌ పలు విషయాలను తెలియజేశారు. 
 
గూఢచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు. “మేజర్” ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ ‌లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్,  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రోజు నిర్వహించిన జి 2 ప్రెస్ మీట్ లో “ప్రీ విజన్” లాంచ్ చేశారు మేకర్స్. ప్రీ-విజన్ వీడియోలో  శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో శేష్ ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు. 
 
అడివి శేష్  మాట్లాడుతూ.. జి2 ని ఒక ఫ్రాంచైజ్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే తపన వుంది. కొత్త దర్శకుడు వినయ్ కి చాలా గ్రేట్ విజన్ వుంది. తనకి గూఢచారి వరల్డ్ పై చాలా మంచి పట్టువుంది. మా నిర్మాతలు విశ్వప్రసాద్, అనిల్, అభిషేక్ గారికి కృతజ్ఞతలు. నేను ఏదడిగినా సమకూరుస్తారు. గూఢచారి సౌత్ ఇండియా స్పై సినిమాల ట్రెండ్ మళ్ళీ తీసుకొచ్చింది. జి 2 తో ఆల్ ఇండియా ఫ్రాంచైజ్ గా మారబోతుంది. జి2 నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. సిక్స్ ప్యాక్ చేసి షూటింగ్ మొదలుపెడతాం. జి2 కి శ్రీచరణ్ మ్యూజిక్ అందిస్తారు. ఈ చిత్రాన్ని ఐదు దేశాల్లో షూట్ చేయబోతున్నాం. జి 2 ఏ స్థాయిలో వుంటుందో ప్రేక్షకులకు చిన్న రుచి చూపించడానికి ప్రీవిజన్ ని లాంచ్ చేశాం. 2024లో జి2 రాక్ ది బాక్స్ ఆఫీస్’’ అన్నారు  
 
వినయ్ మాట్లాడుతూ.. గూఢచారి అనే వరల్డ్ చాలా యూనిక్. జి 2 ప్రేక్షకుకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ప్రీ విజన్ కి శ్రీచరణ్ చాలా చక్కని సంగీతం అందించారు. మిగతా సాంకేతిక నిపుణులు కూడా చక్కని వర్క్ ఇచ్చారు. సినిమా అంచనాలకు మించి వుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన అడివి శేష్ కి , దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తెలిపారు.
 
నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. నిర్మాణంలోకి వచ్చిన కొత్తలో గూఢచారి చేశాం. కొత్త కంటెంట్ ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకాన్ని ఇచ్చిన చిత్రమిది. ఇప్పుడు మా నిర్మాణంలో దాదాపు 20 చిత్రాలు వున్నాయి. జి2 మాకు ఎంతో  ప్రత్యేకమైన సినిమా. పాన్ ఇండియా గా లాంచ్ చేసి పాన్ వరల్డ్ సినిమా స్థాయికి తీసుకువెళ్లాని భావిస్తున్నాం. జి సిరిస్ లో మరిన్ని సినిమాలు చేయాలనే ఆలోచన కూడా వుంది.  
 
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ 
 
ఈ సందర్భంలో మరో విషయం చెప్పాలని భావిస్తున్నాను. అభిషేక్ అగర్వాల్ ది కాశ్మీర్ ఫైల్స్ ఆస్కార్ కి షార్ట్ లిస్టు అయ్యింది. అలాగే ఈ చిత్రానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా వరిచింది. ఈ సందర్భంగా వారికి అభినందనలు’’ తెలిపారు నిర్మాత టిజి విశ్వ ప్రసాద్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు