ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించనున్న సినిమా `గ్రే`. అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై కిరణ్ కల్లాకురి నిర్మాతగా రాజ్ మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ద స్పై హూ లవ్డ్ మి అనేది ఉపశీర్షిక. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. మూహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్ స్క్రిప్ట్‌ను అందజేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిబొట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.