భజరంగీ భాయీజాన్ చిత్రం చూస్తుంటే అందులో షాహిదా పాత్ర పోషించిన క్యూటెస్ట్ గర్ల్ షాహిదా(మున్నీ)... అసలు పేరు హర్షాలీ మల్హోత్రా నటన ఆకట్టుకుంటుంది. ఈ చిన్నారి జూన్ 3, 2008లో జన్మించింది. 2014లో ఓ టెలీఫిలిమ్లో నటించింది. ఐతే కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కే భజరంగీ భాయిజాన్ చిత్రంలో మాటలు రాని మూగ వికలాంగురాలి పాత్రలో నటించేందుకు పోటీ జరిగింది. ఈ పోటీలో హర్షల్ మల్హోత్రా కూడా పాల్గొన్నది. భజరంగీ భాయిజాన్ చిత్రంలో కీలక పాత్ర అయిన ఈ పాత్రలో నటించేందుకు ఈ చిన్నారితో పాటు మొత్తం 5000 మంది పాల్గొన్నారు.
ఐతే చిట్టచివరికి ఆడిషన్లో మల్హోత్రా నెగ్గింది. పాత్రలో నటించేందుకు ఎంపికైన ఈ చిన్నారి తన నటనలో కూడా నెంబర్ వన్ అనిపించుకుంది. భజరంగీ భాయిజాన్ చిత్రంలో ఆసాంతం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నటిస్తూ కోట్లమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. పాకిస్తాన్ బాలిక పాత్రలో నటించిన మల్హోత్రాకు ఇప్పుడు చేతినిండా సనిమాలున్నాయి.