మానవతామూర్తి, దానశీలి, బాలీవుడ్ ప్రభంజనం సోనూ సూద్ తన దాతృత్వంతో, సేవాగుణంతో నిజ జీవితంలో హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన ఆయన మరెందరో జీవితాలను మార్చి ప్రజల గుండెల్లో ఆరాధ్యుడయ్యాడు. పైలట్ కావాలి అనుకున్న ఒక సామాన్యుడి కలను సాకారం చేశాడు సోనూ సూద్. ఈ రోజు, ఆ వ్యక్తి పైలట్‌గా ఏవియేషన్ అకాడమీలో గ్రౌండ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడు. సోనూ సూద్ అంటే ఏంటో ఈ సామాన్యుడి కథ ప్రపంచానికి మరోసారి తెలియజేసింది.