బ్రహ్మాండాల రూపకర్త శంకర్ దర్శకత్వంలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం రోబో-2. ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్షన్ హీరో అర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ నటించనున్నాడనే వార్తలు కోలీవుడ్‌లో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. గతంలో శంకర్, రజనీకాంత్‌ల కాంబినేషన్లో విడుదలై సూపర్ హిట్ కొట్టిన చిత్రం రోబో.
వీరి కాంబినేషన్లోనే రోబో సీక్వెల్ కూడా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ జోరుగా జరుగుతోంది. ఈ పనుల్లో శంకర్ బిజీగా ఉన్నాయి. ఈ సినిమా వివరాలను శంకర్ అత్యంత సీక్రెట్‌గా ఉంచుతున్నాడు. తాజా సమాచారం ఏంటంటే ఈ చిత్రంలో హాలీవుడ్ హీరో అర్నాల్డ్ కూడా నటించనున్నారట. ఆ మధ్య శంకర్ దర్శకత్వంలో విడుదలైన 'ఐ' మూవీ ఆడియో వేడుకకు అర్నాల్డ్ హాజరైన విషయం తెలిసిందే.