మెగాస్టార్ చిరంజీవి పై గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానం చిరు జల్లుల్లా పడుతుంటే తడిసి ముద్ద అవ్వని మెగాభిమాని లేడు. ఆది మాటల ప్రవాహం చిరంజీవి కళ్ల నుంచి జాలువారిన ఆనంద భాష్పాలే అయ్యాయి. ఆది చెప్పిన ప్రతి మాట వాస్తవం.. ప్రతి మెగాభిమాని మనసు పొరల్లో దాచుకున్న అక్షరాలు. చిరంజీవికి, ప్రపంచానికి ప్రతి మెగాభిమాని చెప్పాలని అనుకున్న మాటలకు ఆది గొంతుక ఒక ఘంటారావం అయింది. సినిమా అనే యుద్ధభూమిలో సైన్యాధక్షుడు అయిన చిరంజీవి అంటూ హైపర్ ఆది చిరు జల్లులు కురిపించారు.
అభిమానుల రుణం ఎలా తీర్చుకునేది అని మెగాస్టార్ చిరంజీవి అంటారు. కానీ.. ఆది తన అభిమానంతో అభిమానిగా చిరంజీవి రుణం తీర్చుకున్నారు. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకున్న ఎంతోమంది అభిమానుల్లో ఒకరైన ఆది ఆ చిరంజీవే గర్వపడేలా చేశారు. మెగాస్టార్ చిరంజీవి కష్టాన్ని, 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని, విజయాల్ని మాత్రమే కాదు.. అపజయాలను, విమర్శలను సైతం అయన ఢీకొట్టి నిలిచి గెలిచిన ఉదంతాలను ప్రపంచానికి తన గళం ద్వారా చెప్పినందుకు హైపర్ ఆదికి మెగాభిమానులు సర్వదా కృతఘ్నులు.