నేను ఛాంబ‌ర్ నిర్ణయం వైపే - ప‌వ‌న్ మాట‌లు ఏకీభ‌వించ‌నుః మంచు విష్ణు

మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (19:23 IST)
Manchu vishnu pannel
మంచు విష్ణు మంగ‌ళ‌వారంనాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కార్యాల‌యంలో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆయ‌న‌తోపాటు ఆయ‌న పేన‌ల్ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. మ‌ధ్యాహ్నం 12.30గంట‌ల త‌ర్వాత ముహూర్తం చూసుకుని ఆయ‌న బ‌య‌లుదేరారు. ఫిలింన‌గ‌ర్‌లో వున్న మోహ‌న్‌బాబు ఇంటినుంచి ర్యాలీగా త‌న అనుచ‌రుల‌తో అభిమానుల‌తో ఫిలింఛాంబ‌ర్‌కు వ‌చ్చారు. అక్క‌డ అభిమానులు బాణాసంచాల కాల్చి పండుగ వాతావ‌ర‌ణం క‌లగ‌చేశారు. అక్క‌డ‌ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలను అందచేశారు. ఈ సంద‌ర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, మా అధ్యుడిగా నేను గెలుస్తాన‌నే న‌మ్మ‌కం వుంద‌ని పేర్కొన్నారు.
 
అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అయితే మా వెనుక వున్నార‌ని మీడియా రాస్తుంద‌ని అంటూనే నాకు 900 మంది స‌భ్యుల స‌పోర్ట్ వుంద‌ని వెల్ల‌డించారు. ఇటీవ‌లే రిప‌బ్లిక్ ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ మాట్లాడిన మాట‌ల‌కు మంచు విష్ణు మాట్లాడుతూ, ప‌వ‌న్‌గారి మాట‌ల‌కు నేనే ఏకీభ‌వించ‌డంలేద‌న్నారు. ఛాంబ‌ర్ తీసుకున్న స్టాండ్‌కు క‌ట్టుబ‌డి వున్నాను. మ‌రి ప్ర‌కాష్‌రాజ్ ఎవ‌రివైపు వున్నారో చెప్ప‌మ‌నండ‌ని కామెంట్ చేశారు. మా మానిఫెస్టో చూస్తే చిరంజీవిగారు, ప‌వ‌న్‌గారు నాకే ఓటు వేస్తార‌ని మంచు విష్ణు న‌మ్మ‌కంగా చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు