సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 12న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో వై.ఎస్.ఆర్. డైలాగ్‌లు పెట్టారు. దీనిపై దర్శకుడు స్పందించారు.