తనకు తెలుగులో అవకాశమిచ్చిన ముగ్గురు దర్శకులలో ఏ ఒక్కరూ తనను గద్దించలేదని, పాత్ర చిన్నదైనా, పెద్దదైనా క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకుని దర్శకులు చెప్పినట్లు నటించానంటోంది అనుపమా పరమేశ్వరన్. ‘అఆ’, ‘ప్రేమమ్’లో చేసిన పాత్రల లెంగ్త్ తక్కువ అయినప్పటికీ మంచి పేరు తెచ్చాయి. దాంతో నేను సరైన నిర్ణయమే తీసుకున్నామనిపించింది. ఇక ‘శతమానం భవతి’ అయితే నన్ను ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా ప్రమోట్ చేసి, కెరీర్‌కి ప్లస్ అయింది అంటున్న అనుపమ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, చందూ మొండేటి, సతీశ్ వేగ్నేశ్‌లతో తన అనుబంధాన్ని తెలుగు పాఠకులతో, ప్రేక్షకులతో పంచుకుంది. అదెంటో ఆమె మాటల్లోనే విందాం.
"త్రివిక్రమ్ ‘అఆ’ ఒప్పుకున్నప్పుడు నాకు తెలుగు లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చిన్న ‘క్లూ’ కూడా లేదు. దాంతో భయం అనిపించింది. సినిమా వదిలేద్దామంటే మళ్లీ ఇలాంటి క్యారెక్టర్ వస్తుందో రాదో అని భయం. హీరోయిన్ అవ్వాలనుకున్నప్పుడు నెగటివ్ షేడ్ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చినా చేయాలనుకునేదాన్ని. లక్కీగా తెలుగులో మొదటి సినిమాకే అది కుదిరిం ది. త్రివిక్రమ్ వెరీ టాలెంటెడ్. నాతో ఆ క్యారెక్టర్ బాగా చేయించారు."
"సతీష్ వేగేశ్న ‘అఆ’, ‘ప్రేమమ్’లో నావి చిన్న క్యారెక్టర్స్. ‘శతమానం భవతి’ హీరోయిన్‌గా ఫుల్ లెంగ్త్ రోల్ చేశాను. ఈ సినిమాలో నేను చేసిన నిత్య పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. వేగేశ్న సతీష్ వెరీ కూల్ పర్సన్. ఈ సినిమా కోసం 50 రోజులకు పైగా వర్క్ చేసి ఉంటాం. ఒక్క రోజు కూడా ఆయనలో నేను కోపం చూడలేదు. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను."
నాలా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి మా స్థాయికి మించి ఏ హోదా వచ్చినా అది హ్యాండిల్ చేయడం కష్టమే. అమ్మా–నాన్న–అన్నయ్య–నేను. చిన్న ప్రపంచం. ఇప్పుడు పెద్ద ప్రపంచంలోకి వచ్చేశాను. ఈ స్టేటస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో చిన్న కన్‌ఫ్యూజన్ ఉంది. కాదనడంలేదు. ఈ కన్‌ఫ్యూజన్‌ని ఎంజాయ్ చేస్తున్నాను అంటున్న అనుపమ ఇలాగే మంచి పాత్రలు పోషించాలని, ప్రేక్షకులు గుర్తింపును తెచ్చుకోవాలని ఆశిద్దాం..