మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ నీహారిక. ఈమె నాగ చైతన్యతో ఒక మనసు చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం తీవ్ర నిరాశకు లోను చేసింది. ఈ దెబ్బతో ఆమె సినిమా ఆలోచనలు మానుకుని, తిరిగి బుల్లితెర మీదకు వెళ్లిపోతుందని ఫిల్మ్ నగర్లో జోరుగా గుసగుసలు వినిపించాయి.
కాగా, ప్రస్తుతం ఆమె రెండు సినిమాలకు సంతకాలు పెట్టినట్టు తెలుస్తోంది. వాటిలో ఒక సినిమాను నూతన దర్శకుడు కార్తీక్ డైరక్షన్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో నిహారికకు జోడీగా 'పెళ్లి చూపులు' హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ఇది పూర్తి వినోదాత్మకంగా సాగే ప్రేమకథ అని తెలుస్తోంది.