నేను స్టూడెంట్ సర్' తో పరిచయం కావడం ఎలా అనిపిస్తోంది ?
మిథ్యా తో ఓటీటీకి పరిచయమయ్యాను. అలాగే నా హిందీ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది . ఇప్పుడు నేను స్టూడెంట్ సర్'తో తెలుగులో పరిచయం కావడం చాలా ఎక్సయిటెడ్ గా వుంది.
నేను స్టూడెంట్ సర్' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
శ్రీనివాస్ గారు, సురేష్ గారి హిందీ ఛత్రపతితో అమ్మ వర్క్ చేశారు. అలా ఈ కథ వినడం జరిగింది. చాలా నచ్చింది. ఇందులోని మలుపులు చాలా ఎక్సయిట్ చేశాయి.
తెలుగులో తొలి సినిమా చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ?
సౌత్ ఇండస్ట్రీ అమ్మకు చాలా ఇష్టం, గౌరవం. ఆమెను ప్రేక్షకులు ఎంతోగానో అభిమానించారు. ఇక్కడ పరిశ్రమలో అమ్మకు మంచి అవగాహన వుంది. హిందీ ఛత్రపతిలో అమ్మ పని చేశారు. అలా ఈ ప్రాజెక్ట్ గురించి సంప్రదించినప్పుడు.. తెలుగులో లాంచ్ కావడానికి, యంగ్ టీమ్ తో కలసి పని చేయడానికి మంచి అవకాశమనిపించింది. కథల ఎంపికలో అమ్మ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు. కానీ అమ్మ సలహాలు తీసుకుంటాను. నాకు ఏం కావాలో, నాకు ఏది బావుంటుందో తనకి తెలుసు.
తెలుగు సినిమాలు చూస్తుంటారా ?
చూస్తాను. పుష్ప, అల వైకుంఠపురములో చిత్రాలలో అల్లు అర్జున్ గారు చాలా గొప్పగా చేశారు. సమంత, నయనతార అంటే ఇష్టం.