నేను ఈరోజు కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను : అల్లు అర్జున్

సోమవారం, 7 నవంబరు 2022 (12:35 IST)
Allu Arjun, Allu Aravind, Shirish
పాన్ స్టార్ గా ఎదిగిన బన్నీ, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శిరీష్ నాకు ఇంతకంటే ఆనందం ఏముంటుంది.రాకేష్ శశి ఈ సినిమాతో  సక్సెస్ ఫుల్ దర్శకుడు అయ్యాడు. ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ శుక్రవారమే విడుదలైంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో  జీఏ-2 పిక్చర్స్‌ పతాకంపై ధీరజ్‌ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచి విజయాన్ని అందుకుంది. అందులో భాగంగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. సక్సెస్ మీట్ కి ముఖ్య అతిధిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. 
 
Allu Arjun, Allu Aravind, Shirish and ohters
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ముందుగా ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు థాంక్యూ సో మచ్. మా కుటుంబానికి ఇదో స్పెషల్ సినిమా. దీని తరువాత ఎన్ని సినిమాలు వచ్చినా, ఈ సినిమా మా కుటుంబానికి ఒక స్వీట్ మెమొరీ. మాకు ఈ హిట్ ఇచ్చిన రాకేష్ శశి గారికి థాంక్యూ సో మచ్.దర్శకుడు రాకేష్ శశి గురించి మాట్లాడుతూ అందరు బాగా చేసి దర్శకుడు సరిగ్గా చెయ్యకపోతే అది డెడ్ బాడీ కి డెకరేషన్ చేసినట్లు ఉంటుంది.  మా నాన్నగారికి కంగ్రాట్స్. ఆయన నా సినిమాలు ఎన్నో చూసారు కానీ, శిరి సినిమా చూడటం ఆయనకు మంచి ఆనందాన్ని ఇస్తుంది.  నా సినిమా హిట్ అయినా కూడా ఇంత హ్యాపీ గా ఉండను ఈరోజు అంత హ్యాపీ గా ఉన్నాను. నేను ఈరోజు కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను.శిరీష్ హిట్ కొట్టిన కొట్టకపోయినా నాకు ఎప్పుడు సక్సెస్ ఫుల్ పర్సన్. ఈ సినిమా రివ్యూస్ లో కూడా శిరీష్ నటన గురించి చూస్తుంటే ఆనందం అనిపించింది. పుష్ప -1 తగ్గేదేలే అంటే పుష్ప -2 అసలు తగ్గేదేలే అనేటట్లు ఉండబోతుంది. అలానే సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులుకు సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు.
 
అల్లు శిరీష్ మాట్లాడుతూ,  సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూస్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. కొన్ని సంవత్సరాలు తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే అనుకి ఈ సినిమా స్వీట్ మెమరీలా ఉంటుంది. మా నాన్నగారు నాకు చాలా ఇచ్చారు. అరవింద్ గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. బన్నీ నన్ను ఎప్పుడు తమ్ముడులా చూడడు కొడుకులా చూస్తాడు. ఇప్పటికి నన్ను ఒక చిన్న పిల్లాడిలా చూస్తాడు. సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టిన కూడా మై బేబీ సిరి అంటాడు. అలానే సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
చిత్ర దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ, బన్నీ సర్ మీరు గంగోత్రి సినిమాతో మొదలుపెట్టి ఇప్పుడు పుష్ప సినిమాతో ప్రపంచం మొత్తం మీ వైపు చూసేలా సాగింది మీ జర్నీ.మీకు చాలామంది అభిమానులు ఉన్నారు , ఆర్మీ ఉంది. మాకు మీరంటే గౌరవం సర్. ఈ సినిమా విజయాన్ని శిరీష్ ఫ్యాన్స్ కి అంకితం చేస్తున్నాను. ఈ సినిమాలో శిరీష్ గారి క్యారెక్టర్ కి, నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన చాలా నేచురల్ గా నటించారు అంటే, అది ఆయన పెట్టిన ఎఫర్ట్. అల్లు అరవింద్ గారు నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు.ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
  
 అను ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ..బన్నీ వాసు గారు ఈ సినిమా కోసం ముందు నన్ను అప్రోచ్ అయ్యి కన్విన్స్ చేసారు. ఈ సినిమాను అర్ధం చేసుకున్న ప్రేక్షకులకు థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. 
 
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, ఈ సంస్థలో 60 ఏళ్ళ కుర్రాడు అల్లు అరవింద్ గారు. ఆయనను చూసి ఎప్పుడూ  ఇన్స్పైర్ అవుతుంటాం.ఈ సక్సెస్ ను  శిరీష్ కంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఈ పొజిషన్ లో ఉండటానికి శిరీష్ కారణం. సో తన సినిమా ఏదున్నా అది సక్సెస్ చెయ్యడానికే ప్రయత్నిస్తాను. అను ఇమ్మన్యుల్ మా సంస్థ మీద నమ్మకంతో ఈ సినిమా చేసారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ నా జీవితంలో ఆయనే ఉన్నారు, నేనే ఆయన, ఆయనే నేను. నన్ను ఎవరైనా ఎంత సంపాదించావు అంటే చాలా సంపాదించాను చెప్తాను, ఎందుకంటే ఆయన సంపాదించింది అంతా నాదే. ఏమి సాధించవు అంటే చాలా సాధించా అని చెప్తా ఎందుకంటే ఆయన సాధిస్తే నేను సాధించినట్టే. థాంక్యూ సో మచ్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు