జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న 'జై లవ కుశ' సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి వరుసగా వదులుతున్న టీజర్ల వరకూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన 'జై' పాత్రకి సంబంధించిన టీజర్లో ఎన్టీఆర్ గొడ్డలి పట్టుకుని చెప్పే డైలాగులు వింటే వళ్లు గగుర్పొడుస్తుంది.