హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో వర్మ మాట్లాడుతూ... సుప్రీంకోర్ట్... పద్మావత్, ఉడతా పంజాబ్ సినిమాలు వివాదస్పదం అయినప్పుడు చాలా క్లియర్‌గా చెప్పింది ఏంటంటే... ఒక సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను ఆ సినిమాను ఆపడానికి వీళ్లేదు అని రెగ్యులేషన్స్ జారీ చేసింది.
అందుకనే తెలంగాణ హైకోర్టుకి ఈ సినిమాని ఆపాలని కొంతమంది ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే కొట్టేయడం జరిగింది. అయితే.. ఏపీలో ఈ సినిమా విడుదలను ఆపేస్తారని ఊహించలేదు. ఇలా జరిగిన దానికి అసలు దీని వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. పేర్లు చెప్పే ధైర్యం లేక కాదు. ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి చెప్పడం లేదు.