తెలుగు టీవీ ప్రోగ్రామ్‌లలో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న 'జబర్దస్త్', 'ఢీ' షోల నుండి 25 మంది టాలీవుడ్ సెలబ్రిటీలతో ఓ భారీ ఈవెంట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. విదేశాలలో తెలుగువారి కోసం ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారని, దుబాయ్‌తో సహా మరే దేశంలో ఇంత స్థాయిలో జరగలేదని చెప్తూ మెల్‌బా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతినిధి శ్రీహరి మార్చి 16న ఆస్ట్రేలియాలో ఈ ఈవెంట్ జరగనున్నట్లు వెల్లడించారు.
'జబర్దస్త్' నుండి చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీమ్స్, అలాగే ఢీ షో మాస్టర్లు, 9 మంది కంటెస్టెంట్స్‌తో ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించామని, హిస్టారికల్ పాలెస్ థియేటర్ వేదికగా మీటీవీ, దోసాహట్, కోట్ సెంటర్ ఇన్సూరెన్స్ ప్రాయోజకులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కామెడీ, డ్యాన్స్, పాటలు, మ్యాజిక్ షో వంటివి ఉన్న ఈ ఈవెంట్‌కు యాంకర్లుగా ప్రదీప్, వర్షిని, విష్ణుప్రియ హోస్ట్ చేయనున్నారు.