''జనతా గ్యారేజ్'' ఫస్ట్ డే కలెక్షన్స్: భారత్‌లోనే కాదు.. అమెరికాలో దుమ్ములేపింది.. 2వేల థియేటర్లలో?

శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (12:47 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' చిత్రానికి విడుదల ముందు నుండే భారీ అంచనాలు ఉన్నాయి. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. గురువారం విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా భారీ ఓపెనింగ్స్‌ రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఫుల్‌ ఖుషి ఖుషీగా ఉన్నారు. తాజాగా చిత్రం సక్సెస్‌మీట్‌ను కూడా యూనిట్‌ సభ్యులు నిర్వహించి, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 
 
ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లలకు పైగా విడుదలైన 'జనతా గ్యారేజ్‌' ఒక్క భారత్‌లోనే కాకుండా అమెరికాలో కూడా దుమ్ములేపుతుది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. వారం మధ్యలో విడుదలైనా 'జనతా గ్యారేజ్‌' అమెరికాలో అద్భుతంగా ఆడుతోందని.. హిందీ పెద్ద సినిమాలను తలదన్నేలా ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా సినిమాపై మంచి టాక్ రావడంతో.. వారాంతరంలో కూడా 'జనతా గ్యారేజ్‌' దుమ్ము లేపే అవకాశాలున్నాయని అన్నారు. జనతా గ్యారేజ్‌ కలెక్షన్స్‌ వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం....
 
నైజాం : 5.5 కోట్లు
సీడెడ్‌ : 3.5 కోట్లు
ఈస్ట్‌ : 2.28 కోట్లు
ఉత్తరాంధ్ర : 2.3 కోట్లు
వెస్ట్‌ : 1.85 కోట్లు
గుంటూరు : 2.54 కోట్లు
కృష్ణ : 1.54 కోట్లు
నెల్లూరు : 90 లక్షలు

వెబ్దునియా పై చదవండి